ప్రభుత్వ పథకాలతో పేదలకు ఎంతో మేలు: నారెడ్డి మోహన్ రెడ్డి

charset=InvalidCharsetId

నవతెలంగాణ – రామారెడ్డి

ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాలతో, ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతుందని, ప్రజాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని శనివారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి అన్నారు.గృహ జ్యోతి,గృహ లక్ష్మీ పథకాలను ప్రభుత్వం అమలు చేసినందుకు, మండల కేంద్రంలో బస్టాండు ఆవరణలో సోనియాగాంధీ, రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల అభివృద్ధి ప్రభుత్వమని, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి, పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. త్వరలో ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, కాంగ్రెస్ నాయకులు నా రెడ్డి రాజిరెడ్డి, రాతుల రెడ్డి నాయక్, బండి ప్రవీణ్, పెండ్యాల నర్సారెడ్డి, బాబురావు, శ్యామ్, గడ్డం చిన్న గంగారెడ్డి, రఘుపతి రెడ్డి, నామాల రవి, బి పేట నర్సింలు, కిషన్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.