పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని, ఒక తండ్రిగా జైలుకెళ్లి పరామర్శించాలి గాని, అధికారాన్ని కోల్పోయి, మతిభ్రమించి మాట్లాడటం మాజీ ముఖ్యమంత్రిగా కెసిఆర్ కు తగదని, రైతు రుణమాఫీ రుణమాఫీ చేయక రైతులను మోసం చేసింది పోయి, రైతులపై ముసలి కన్నీరు కాల్చడం, దయ్యాలు వేదాలను వల్లించినట్లు ఉందని సోమవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారంలో ఉండగా కుటుంబ సభ్యులను గాలికి వదిలేస్తే, కుంభకోణాలు చేసి జై లలో ఉంటే చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయంలో, రైతు రుణమాఫీ, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, రైతులకు ఉచిత ఎరువులు, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి లాంటి ఎన్నో అమలు చేయక ప్రజలను మోసం చేస్తేనే, మీకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, పది సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేలకు, ఎంపీలతో పాటు మంత్రులకు తగి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే పార్టీలు మారుతున్నారని, నువ్వు ఎన్ని అబద్ధాలు మాట్లాడిన ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని, రాబోయే రోజుల్లో మరింత గుణపాఠం మీకు తప్పదని హెచ్చరించారు.
కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు: నారెడ్డి మోహన్ రెడ్డి
నవతెలంగాణ – రామారెడ్డి