
యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికంటి నరేందర్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసారు. ఆదివారం హైదరాబాద్ లోని మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో ఆయనను కలిసి స్వీట్లు అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ నరేందర్ గౌడ్ కు స్వీటు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నరేందర్ గౌడ్ వెంట యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్, బింగి శుభం తదితరులున్నారు.