నిరుద్యోగుల జీవితాలతో నరేంద్ర మోడీ చెలగాటం

– ఎన్నికల పైన ఉన్న శ్రద్ధ ఉద్యోగాల భర్తీ పైన లేదు.
– రాష్ట్ర నాయకులు జర్నలిస్ట్ కె వెంకటేశ్వర్లు.
– యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు మల్లయ్య 
నవతెలంగాణ – అచ్చంపేట 
నిరుద్యోగుల జీవితాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెలగాటం ఆడుతున్నారని, ఎన్నికల పైన ఉన్న శ్రద్ధ ఉద్యోగాల భర్తీపైన ఎందుకు లేదని సీనియర్ జర్నలిస్ట్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు మల్లయ్య ప్రశ్నించారు. పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ డివిజన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు వర్ధo సైదులు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ప్రాముఖ్య జర్నలిస్ట్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగ యువకులకు హామీ ఇచ్చింది. 10 సంవత్సరాలు కావస్తున్న నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం సరైన పద్ధతి కాదన్నారు. కులం , మతం పేరుతో చిచ్చు పెడుతూ. అధికారం దక్కించుకుంటుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే కుట్ర జరుగుతుందన్నారు.  రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ క్యాలెండర్ ని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు  ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు మల్లయ్య.డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి శివవర్మ , డివిజన్ అధ్యక్షులు కిరణ్ , ప్రధాన కార్యదర్శి సునీల్, శివరాం, శివశంకర్, అరుణ్, నాయకులు శివ, కిరణ్ సాయి అజయ్ శీను, రాజు ఉన్నారు.