
నవతెలంగాణ – రెంజల్
దేశ ప్రజలను మోసం చేసిన నరేంద్ర మోడీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లను రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ ఎంఎల్ ప్రజా పంత మస్ లైన్ నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాస్ లైన్ నాయకులు నడిపి నాగన్న, పార్వతి రాజేశ్వర్లు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పసుపు బోర్డును తెస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన ధర్మపురి అరవింద్ ఈసారి ప్రజలు బుద్ధి చెప్తారని వారు తెలిపారు. ఎర్రజొన్నలకు మద్దతు ధర వచ్చేలా చూస్తానని చెప్పిన ఆయన ఇంతవరకు ఇలాంటి హామీ నెరవేర్చలేదని వారు అన్నారు. వ్యవసాయ రంగాని కాపాడాలని ఢిల్లీ కేంద్రంగా ఉద్యమాలు చేపట్టాగా తప్పకుండా కాపాడుతాను అన్న మోడీ అబద్ధాలాడి తప్పించుకున్నారని వారు ఎద్దేవా చేశారు. రాబోవు ఎన్నికల్లో అబద్దాలు ఆడిన వీరి నీ చిత్తుగా ఓడించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు వడ్డేన్న, నడిపి నాగన్న, ఎస్ కె నజీర్, పార్వతి రాజేశ్వర్, పెద్దులు, ఎల్ గంగాధర్, సంతోష్, పోశెట్టి, లక్ష్మణ్ ,సాయిలు, మహబూబ్, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.