బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి: నరేశ్

నవతెలంగాణ – మల్హర్ రావు
బడిఈడు పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మండలంలో వళ్లెంకుంట పంచాయతీ కార్యదర్శి నరేశ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం వళ్లెంకుంట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి,ఉపాధ్యాయులు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య,మధ్యాహ్న భోజనం,పుస్తకాలు,నోట్ బుక్స్, యూనిపామ్స్ వంటి సౌకర్యాలు గురించి తల్లిదండ్రులు వివరించారు.విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు.10వ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జీపీఏ సాధించడం జరుగుతుందన్నారు.అనంతరం పాంప్లెయిన్స్ ఆవిష్కరించి,విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాధానోపాధ్యాయుడు టి.సుదర్శన్, ఉపాధ్యాయులు మెహరాజ్,సత్యనారాయణ, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.