సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బాలుర ఖోఖో పోటీల్లో మర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎల్, నరేష్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నెల 23,24, 25 న భారత్ స్కౌట్ అండ్ గైడ్ హై స్కూల్ దోమలగూడ హైదరాబాద్ లో నిర్వహించే 68 వ రాష్ట్ర స్థాయి అండర్ 14 బాలుర ఖోఖో పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శుక్రవారం పి. నిర్మల జ్యోతి తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం శ్రీకాంత్, స్వరూప రాణి, సిద్దులు, రాజు, ముఖిద్, రవీశ్వర్, సుజాత, శ్రీధర్, నాగజ్యోతి, శ్రీదేవి, గోపాల్, సుష్మ, భవాని విద్యార్థుల తల్లిదండ్రులు అభిందించారు.