అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై నిర్మాత బన్నీ వాస్ ఓ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా గురువారం అన్నపూర్ణ గ్లాస్ హౌస్‌లో లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. హీరోగా నటిస్తున్న నార్నే నితిన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. డైరెక్టర్ చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ మారుతి స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు.
ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు వర్క్ చేయబోతున్నారు. నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా ఇది. నయన్ సారిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంతో అంజిబాబు కంచిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రామ్ మిర్యాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎస్.కె.ఎన్, ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, అజరు గద్దె.