లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా నారోజు శంకరాచారి..

నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని నూతన లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా నారోజు శంకరాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం స్థానిక లయన్ భవన్ యందు నిర్వహించిన కార్యక్రమంలో సంస్థాగత అధికారి, రెండవ ఉపాధ్యక్షుడు, జిల్లా గవర్నర్ మోర బద్రేశం సమక్షంలో నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నారోజు శంకరా చారి, కార్యదర్శిగా బెజుగం విశ్వ ప్రసాద్,కోశాధికారిగా బోనాల రాజు ప్రమాణ స్వీకారం చేశారు. బెజ్జంకి లయన్స్ క్లబ్ కు అంతర్జాతీయ గుర్తింపు ఉందని అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం అదృష్టమని శంకరా చారి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా సేవలో ముందుకు వెళుతూ గత సంవత్సరం కంటే మెరుగైన సేవలు సమాజానికి అందించి లయన్స్ క్లబ్ కీర్తిని వ్యాప్తి చెందేలా చేయాలని బద్రేశం సూచించారు. ఈ కార్యక్రమంలో మల్టిపుల్ కౌన్సిల్ పాస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి,రీజనల్ చైర్ పర్సన్ సత్యనారాయణ రావు,జోనల్ చైర్ పర్సన్ బోయినిపల్లి సరళ, పుల్లూరు ప్రభాకర్,నారెడ్డి సుదర్శన్,లచ్చిరెడ్డి,రవీంద్ర ప్రసాద్,మహేందర్ రెడ్డి,రాజయ్య,ఆర్పీ భరత్ సింగ్, కొండ శ్రీనివాస్,వెల్ది సత్యనారాయణ,డాక్టర్ జానకి రాములు,నరేష్ తదితరులు పాల్గొన్నారు.