నర్రా ప్రవీణ్ రెడ్డికి ఓయూ నుండి డాక్టరేట్..

– పద్మ శ్రీ అవార్డు గ్రహీత డా. కూరెళ్ళ విఠలాచార్య అభినందన, జిల్లా వాసుల హర్షం 
నవతెలంగాణ  – వెబ్ డెస్క్
ప్రముఖ కవి, రచయిత, నవలాకారుడు నర్రా ప్రవీణ్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ డిగ్రీని ప్రకటించింది. నార్కట్ పల్లికి చెందిన నర్రా వెంకటలక్ష్మీ, రాంరెడ్డిల కుమారుడైన ప్రవీణ్ 2019లో జే ఆర్ ఎఫ్ సాధించి పీ హెచ్ డీలో చేరాడు. సకాలంలో తన పరిశోధనా లక్ష్యాన్ని పూర్తిచేసి విశ్వవిద్యాలయ ఆచార్యుల మన్ననలు పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎస్. రఘు గారి పర్యవేక్షణలో ‘ఏనుగు నరసింహారెడ్డి సాహిత్యం- సమగ్ర అధ్యయనం’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి డాక్టరేట్ పట్టాను సాధించాడు. చిన్న వయస్సులో డాక్టరేట్ డిగ్రీని పొందిన నర్రా ప్రవీణ్ ను పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.కూరెళ్ళ విఠలాచార్య, ఎం వి. గోనారెడ్డి, వేణూ సంకోజు, డా. తండు కృష్ణకౌండిన్య, డా. బెల్లి యాదయ్య, డా. చింతల రాకేష్ భవాని, ఏబూషి నరసింహ, పున్న అంజయ్య, డా. ఎండీ హసేనా, చింతల యాదగిరి, అభినయ శ్రీనివాస్, కూరెళ్ళ శ్రీనివాస్,చింతపల్లి వెంకన్న వంటి ప్రసిద్ధులు అభినందించారు. జిల్లా వాసులు హర్షం వ్యక్తంచేశారు.
తెలంగాణ సాహితి అభినందన..
ప్రముఖ కవి, నవలాకారుడు నర్రా ప్రవీణ్ రెడ్డికి ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ డిగ్రీని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ అభినందనలు తెలిపింది.‌ ఈమేరకు తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభాపురం జనార్దన, కె.ఆనందాచారి, రాష్ట్ర నాయకులు అనంతోజు మోహన్ కృష్ణ, ఎస్.కె.సలీమ తదితరులు అభినందనలు తెలిపారు.