మండలంలోని మైలారం గ్రామంలో వాడవాడలో ఏర్పాటు చేసిన గణనాథులను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు ఉల్లంగుల నర్సయ్య సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి మండపాల కమిటీలకు సుమారు ఒక లక్ష పదివేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. యువత ఆధ్యాత్మిక చింతనతో గణపతులను ప్రతిష్టాపించి నవరాత్రులు పూజలు చేయడం అభినందనీయం అన్నారు. యువత సన్మార్గంలో వెళ్లడానికి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. మత సామరస్యానికి ప్రతీక అయినా గణపతి ఉత్సవాన్ని మైలారం గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. మైలారం గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మైలారం గ్రామానికి మరింత సేవ చేయడానికి ముందుకు వస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, సామాజిక కార్యకర్త కిరణ్ కుమార్ రెడ్డి, చిర్ర శ్రీధర్, బొమ్మినేని గౌతమ్, బాధ రవి, టెంట్ భిక్షపతి, కొల అనిల్, బాదావత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.