కాంగ్రెస్ పార్టీకి నర్సరెడ్డి చేసిన సేవలు మరువలేనివి..

Narsa Reddy's services to the Congress party are unforgettable.– డీసీసీ అధ్యకులు కూచాడి శ్రీ హరిరావు..
నవతెలంగాణ – సారంగాపూర్
కాంగ్రెస్ పార్టీకి మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి చేసిన సేవలు వెలకట్టి లేనివని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కె శ్రీహరి రావు అన్నారు.బుధవారం సారంగాపూర్ మండలకేంద్రంలో మార్కెట్ యార్డు లో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు దశరథ రాజేశ్వర్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి దివంగత పొద్దుటూరి నర్సారెడ్డి మొదటి వర్ధంతి సభ కు డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షులుగా మంత్రిగా ప్రజలకు ఎంతో సేవచేసారు ఆయన హయాంలో స్వర్ణ ప్రాజెక్టు నిర్మాణం,వ్యవసాయ మార్కెట్,నిర్మల్ లోని ఐటిఐ , నిర్మల్ బస్ స్టాండ్, జివి నర్శిహారావు సొసైటి పాఠశాల అన్నారు. తన సొంత 55 ఎకరాల భూమిని నిరుపేడ ప్రజలకు పంచిన మహానీయుడని కొనియాడారు. మన మధ్యల నరసారెడ్డి బాపు లేకున్నప్పటికీ ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉంటారని గుర్తు చేశారు.అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన జిల్లా, మండల నాయకులు అభిమానులు అంతకలసి స్వర్ణ ప్రాజెక్టు కు పి నర్సారెడ్డి గారి పేరు పెట్టాలని,నిర్మల్ పట్టణం తోపాటు స్వర్ణ ప్రాజెక్టు వద్ద ఆ మహా నీయుని విగ్రహాన్ని పెట్టిందుకు వర్ధంతి సభలో సంతకాలు చేసి ఏకగ్రీవంగా తీర్మానించి డీసీసీ అధ్యక్షులు శ్రీహరీరావు కు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈ జిల్లా జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ సయ్యద్ అర్జుమాండ్ అలీ. డీసీసీబీ డైరెక్టర్ నారాయణ రెడ్డి,మార్కెట్ ఛైర్మెన్ అబ్ధుల్ హది,పీసీసీ సభ్యులు సుదర్శన్,శేఖర్, జిల్లా కిసాన్ సెల్ వ్వర్కింగ్ ప్రసిడెంట్ అట్లా పొతరెడ్డి,నాయకులు శ్రీనివాస్ రెడ్డి,రాజ్ మహమ్మద్ ,నాందే దపు చిన్నూ, వెంకటరమణ రెడ్డి ,విలాస్ రావ్,నారాయణ రెడ్డి,నర్సారెడ్డి, ముత్యం రెడ్డి ,లక్ష్మన్, నవీన్ రెడ్డి, చిన్నయ్య, మారుతి,జగదీశ్వర్,పోతన్న,భూమన్న, పృథ్వీ రాజ్ రెడ్డి,సూర్యం,రవీంద్రనాథ్ రెడ్డి,నర్సింహారెడ్డి,నిఖిల్, శెఫిక్ ,మహేందర్, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.