తాడిచెర్ల కళాశాలలో  “నషా ముక్త్ భారత్ ” ప్రతిజ్ఞ

"Nasha Mukt Bharat" Pledge in Tadicherla Collegeనవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  కళాశాల ప్రిన్సిపాల్ విజయదేవి ఆదేశాల మేరకు సోమవారం మాదక ద్రవ్య రహిత భారత్ ప్రచారంలో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులచే  “నషా ముక్త్ భారత్” ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని ఎన్ఎస్ఎస్ పోగ్రామ్ అధికారి రవిందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దేశానికైనా యువతే శక్తి సమాజమని, దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని,కావున యువత మదకద్రవ్యాలను పూర్తిగా నిషేధించాలన్నారు.ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నరేందర్ ప్రవీణ్ వెంకటరెడ్డి కరుణాకర్ స్వరూప రాణి నరేష్ రమేష్ భరత్ రెడ్డి జైపాల్ రవి కళాశాల సిబ్బంది రాములు రవి షబ్బీర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.