ఉద్యోగుల శ్రేయస్సే తమ లక్ష్యమని టీఎన్జీవోస్ జిల్లా నూతన అధ్యక్షుడు నాశెట్టి సుమన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్(టీఎన్జీవోస్) భవన్ లో బుధవారం సుమన్ తోపాటు సహాధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజు బాధ్యతలు చేపట్టారు. యూనియన్ పూర్వ అధ్యక్షుడు, టీజీవో ప్రస్తుత అధ్యక్షుడు అలుక కిషన్ సుమన్ ను అధ్యక్షుడి కుర్చీలో కూర్చబెట్టారు. ఈ సందర్భంగా టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు సుమన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తనకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు రుణపడి ఉంటానని తెలియజేశారు. అలాగే వివాదాలకు తావులేకుండా టీఎన్జీవోస్ ను ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి, సీనియర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టిఎన్ఓఎస్ ఉద్యోగులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుమన్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా టిఎన్జీవోఎస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.