నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగ జరిగింది. సోమవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలకు ఎన్నికల అధికారిగా సిహెచ్ రోజా ( జూనియర్ ఇన్స్పెక్టర్ అఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ ) అధికారి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించి, ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం అధ్యక్షులు భరత్ కుమార్ గంగపుత్ర, ఉపాధ్యక్షులు ముత్యం రాములు, కార్యదర్శి – గువ్వల మొగులయ్య డైరెక్టర్స్ 1పెద్ద మోహన్, 2.వంగల మోహన్,3. శ్రీకాంత్, 4. వినయ్ కుమార్, 5.సంజీవ్, 6.సాయులు గార్లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. సంఘం యొక్క అభివృద్ధికి, గంగమ్మ తల్లి మందిరం నిర్మాణం పూర్తి చేయుటకు కృషి చేస్తానని, నూతన అధ్యక్ష కార్యదర్శి భరత్ కుమార్, మొగులయ్య తెలిపారు. ఎన్నికైన కార్యవర్గం ను అభినందించారు.