నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని నటరాజ నృత్యానికేతన్ గురువు బాశెట్టి మృణాళిని అనంతసాగర్ లో అమ్మవారి క్షేత్ర సన్నిధానంలో బృంద నృత్యం 20 మంది చిన్నారులతో 9 నిమిషాల 33 సెకండ్లు అమ్మవారికి నృత్యంతో నాట్యార్పణం అమ్మవారి మెట్ల పైన డ్రోన్స్ ఉపయోగిస్తూ చిన్నారుల ప్రదర్శన అలరించింది. ఈ నాట్యానికి కాను మన నటరాజ నృత్యానికేతా నానికి డివోషనల్ అండ్ స్పిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చిన్నారులందరికీ మెమొంటోస్ ప్రశంస పత్రాలు తల్లిదండ్రుల చిన్నారుల ఆనందోత్సవాల మధ్య అందుకోవడం జరిగింది అని నాకె గురువు బాసెట్టి మృణాళిని గురువారం తెలిపారు. ఇది నిజంగా అందరూ గర్వించదగిన విషయం మన నటరాజ నృత్యానికేతనానికి అందినటువంటి మంచి గౌరవం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సన్నివేశం అని చిన్నారులను అభినందించడం జరిగింది .చిన్నారులందరినీ ఇంకా ఇలాగే ఎన్నో ప్రశంసలు అందుకోవాలని ప్రపంచంలోనే మన నటరాజ నృత్యాని కేతన్ ఉన్నత స్థాయికి ఎదగాలని పలువురు కోరినారు.