– ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల ధర్నా
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే రైతులను పట్టించుకునే నాథుడే లేడని మంగళవారం మండలకేంద్రంలో రైతులు ప్రధాన రహదారి ధర్నా నిర్వహించారు. అధికారులు ధాన్యాన్ని తూకం వేసేంతవరకు ధర్నా విరమించేది లేదని రైతులు బీష్మించారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మార్కెట్లో పోసి 50 రోజులు గడుస్తున్నప్పటికీ వానాకాలం సీజన్ ప్రారంభం మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఏ ఒక్క అధికారులు స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ధాన్యం తూకవేయడంలో జాప్యం లారీలలో జాప్యం రైస్ మిల్లర్లు జాప్యం జరుగుతుందని అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీల కొరత కారణంగా కాంట వేయకపోవడం వేసిన ధాన్యం బస్తాలు రైస్ మిల్లులకు సకాలంలో తరలించడం లేదని, రైస్ మిల్లు యజమానులు దించుకోవడం లేదని తెలిపారు.వ్యవసాయ కార్మిక సంగం జిల్లా ఉపాధ్యక్షులు కోట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్లో పోసి 50 రోజులవుతున్న తూకం వేయకపోవడం అకాల వర్షాల వల్ల ధాన్యం రాశులు కొట్టుకపోయి ఎంతో నష్టపోయారన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి మార్కెట్లో నిలిచిపోయిన ధాన్యం రాశులను వెంటనే కొనుగోలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు, ఈ ధర్నాలో రైతులు బుచ్చిరెడ్డి ,సైదులు, శీను, బిక్షపతి ,పాండు, వందలాది మంది రైతులు పాల్గొన్నారు.