విజ్ఞప్తి చేసిన పట్టించుకునే నాథుడేలేరు?

– పోతారంలో విస్తృతంగా లక్కపురుగు వ్యాప్తి..

– గగ్గోలు పడుతున్న ప్రజలు 
– లక్కపురుగు నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి 
నవతెలంగాణ – బెజ్జంకి
లక్కపురుగు విస్తృతంగా వ్యాప్తి చెంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసిన పట్టించుకునే నాథుడేలేరని మండల పరిధిలోని పోతారం గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గోదాముల నిర్వహణపై వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారులు,పాలకవర్గం సభ్యులు అలసత్వం వహించడం వల్ల లక్కపురుగు వ్యాప్తి చెందుతుండడంతో రాత్రి వేళల్లో పోతారం గ్రామ ప్రజలు గగ్గోలు పడుతూ నిద్రలేమి సమస్య తలెత్తుతోందని..గతంలో పలుమార్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడంలేదని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ఏఎంసీ పాలకవర్గం సభ్యులు,అధికారులు గోదాముల నిర్వహణపై దృష్టి సారించి లక్కపురుగు నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.సమస్యను నవతెలంగాణ మంగళవారం ఏఎంసీ చైర్మన్ చంద్రకళ దృష్టికి తీసుకువేళ్లగా లక్కపురుగు నివారణకు వేంటనే చర్యలు చేపడుతామని తెలిపారు.