బాల్‌ బ్యాడ్మింటన్‌లో విద్యార్థికి జాతీయస్థాయి అవార్డు

రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తున్న విద్యార్థి సిద్ధార్థ
– చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి
– ఉమ్మడి జిల్లాలో ఉత్తమ అవార్డులు అందుకున్న విద్యార్థి సిద్ధార్థ
– తల్లిదండ్రుల ప్రోత్సాహమే విద్యార్థికి అండ
నవతెలంగాణ-మిరుదొడ్డి
బ్యాటు పట్టుకుని గ్రౌండ్‌లోకి దిగాడంటే ప్రతి క్రీడాకారుడి వెన్నుల్లో వణుకు పుట్టాల్సిందే. గాలి పీల్చుకుంటే షాట్ల పర్వం కురవాల్సిందే. బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడల్లో రాణిస్తూ జాతీయస్థాయిలో మంచి గుర్తింపు సాధించడం ఎంతో గర్వంగా ఉంది విద్యతో పాటు క్రీడల్లో ప్రతి ఒక్కరూ ముందుండి గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఉత్తమ అవార్డులు తీసుకుంటూ మండలానికి మరింత పేరు తెచ్చిన విద్యార్థి సిద్దిపేట జిల్లా
మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన సరోజన బాలరాజు దంపతుల కుమారుడు సిద్ధార్థ. ఇతను మిరుదొడ్డి మండల కేంద్రంలోని మోడల్‌స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. నాలుగో తరగతి నుండి బాల్‌ బ్యాలెట్‌ క్రీడపై ఆసక్తి పెంచుకున్నాడు. మండలం.. జిల్లా.. రాష్ట్ర.. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటున్నాడు. అనేకసార్లు జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి పోటీల్లో అవార్డులు సాధించి మండలానికి మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాకు సారథ్యం వహిస్తూ రాష్ట్ర స్థాయికి సిద్ధార్థ ఎంపికయ్యాడు. సబ్‌ జూనియర్‌ ఆర్డర్‌ 14 బాల్‌ బ్యాట్మెంటల్‌ ఛాంపియన్‌ షిప్‌ లో భాగంగా పలు రాష్ట్రాల్లో పోటీలు పాల్గొన్నాడు. 2018 బిహెచ్‌ఎల్‌ 2019 వరంగల్‌ జిల్లా కల్లూరు 2020లో ఖమ్మం జిల్లా ఉప్పల్‌ 2021లో ఖమ్మం జిల్లా భువననగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడారు. 2022 సబ్‌ జూనియర్‌ ఆర్డర్‌ 15 భవన్లో హైదరాబాద్‌ నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన బాల్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ 2023లో సత్తా చాటుకున్నాడు. అనంతరం సిద్ధార్థ జాతీయస్థాయిలో ఎంపికయ్యాడు. జాతీయస్థాయిలో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్లో జరిగిన రాష్ట్ర సబ్‌ జూనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్షిప్‌ టోర్నమెంట్‌ 2023లో ప్రతిభ చాటి జాతీయస్థాయి క్రీడలకు ఎంపికయ్యాడు. అదే ఏడాది ఫిబ్రవరి 16 నుండి 20 వరకు మంచిర్యాల జిల్లాలోని రాంపూర్‌లో జరిగిన 41వ జాతీయ బాల్‌ బ్యాట్మెంటల్‌ ఛాంపియన్షిప్లో రాష్ట్రస్థాయికి సారథ్యవహించాడు. ఆల్‌ ఇండియా బాల్‌ బ్యాడ్మింటన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాడు.
ఆదర్శంగా తీసుకోవాలి
ఉమ్మడి జిల్లా నుండి రాష్ట్రస్థాయి వరకు బాల్‌ బ్యాట్మెంటల్‌ క్రీడల్లో సిద్ధార్థ ఎన్నో గుర్తింపులు రావడం సంతోషకరంగా ఉంది. మా పాఠశాలకు మొట్టమొదటిసారిగా జాతీయస్థాయి అవార్డు రావడం పట్ల సంతోషంగా ఉంది. జాతీయస్థాయిలో ఆదర్శ పాఠశాలను ఉత్తమంగా నిలపడంపై గర్వంగా ఉంది. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడానికి ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరం.
– భారతీదేవి. మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌
మరింత రాణిస్తా
చదువుతో పాటు క్రీడలో మరింత రాణించడానికి సిద్ధంగా ఉన్నా. గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్ర జాతీయ స్థాయికి వెళ్లడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు. గురువు సహాయంతో జాతీయ స్థాయికి వెళ్లాను.
– క్రీడాకారుడు సిద్ధార్థ