జాతీయ అవార్డు అందుకున్న వరప్రసాద్ గౌడ్ 

నవ తెలంగాణ- హుస్నాబాద్ రూరల్:
న్యూ ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గీతా కార్మికుల అభివృద్ధికి నిరంతరం కృషిచేసిన హుస్నాబాద్ పట్టణ యువకుడు, గీత పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు పూదరి వరప్రసాద్ గౌడ్ బహుజన సాహిత్య అకాడమీ (బిఎస్ఎ) జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, సొసైటీ ప్రధాన కార్యదర్శి సుబ్రమనియన్ చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. దేశంలోని 27 రాష్ట్రాల నుండి సుమారుగా 1000 మంది డెలికేట్స్ ఈ కాన్ఫరెన్స్ కు హాజరైనట్లు వెల్లడించారు. కాగా తన సేవను గుర్తించి జాతీయస్థాయి అవార్డుకు ఎంపిక చేసిన రాధాకృష్ణ కు కృతజ్ఞతలు తెలిపారు.