జాతీయ చెస్‌ చాంప్‌ సంహిత

National Chess Champ Samitaహైదరాబాద్‌ : అండర్‌-9 బాలికల జాతీయ చెస్‌ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ చిన్నారి సంహిత పుంగవనం చాంపియన్‌గా నిలిచింది. ఇటీవల జార్ఖండ్‌లో ముగిసిన జాతీయ టోర్నమెంట్‌లో సంహిత ఓవరాల్‌గా 11 రౌండ్లలో పది పాయింట్లు సాధించింది. చివరి రౌండ్లో తమిళనాడు ప్లేయర్‌, టాప్‌ సీడ్‌ శ్రావణికిపై మెరుపు విజయం సాధించింది. నల్ల పావులతో మొదలెట్టిన సంహిత 35 ఎత్తుల్లోనే శ్రావణికను చిత్తు చేసి విజేతగా అవతరించింది. అండర్‌-9 జాతీయ చాంప్‌గా నిలిచిన సంహితను తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం అధ్యక్షుడు కె.ఎస్‌ ప్రసాద్‌ అభినందించారు.