మండల కేంద్రంలోని సెయింట్ అలీయుద్దీన్ స్కూల్ లో గురువారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే బాలల దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల హెడ్ మిస్ట్రెస్ సయ్యదా జహ్ర ఖాద్రి బహుమతులను, ప్రశంసా పత్రాలను వారికి అందజేశారు.ఈ సందర్భంగా సయ్యదా జహ్ర ఖాద్రి మాట్లాడుతూ విద్యార్థులు భావి తరాలకు నిర్మాతలని,దేశ భవిష్యత్తు తరగతి గదులలోనే రూపు దిద్దుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సయ్యదా హలీమా ఖాద్రి, కరస్పాండెంట్ సయ్యదా సల్మా ఖాద్రి,జాయింట్ సెక్రెటరీ సయ్యదా నువెరా ఖాద్రి, ట్రెజరర్ ఖదిజ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.