నవతెలంగాణ – ముధోల్
బాసర ట్రిపుల్ ఐటీలో మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆర్జీయూకేటీ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్త నిర్వహించిన ప్రపంచీకరణ ప్రభావం గణిత శాస్త్ర సవాళ్లు అనే అంశంపై బుధవారం జాతీయ సదస్సు నిర్వహించారు. వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ఆదేశాల మేరకు గణిత శాస్త్ర నిపుణులు, ఆచార్యులు లతో కలిసి ఆర్జీయూకేటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభో ఉపన్యాసం చేశారు. గణిత శాస్త్రం నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే పరిష్కార మార్గాలను వెలికితీస్తుంన్నారు. ప్రధానంగా వాతావరణ నమూనాలను అర్థం చేసుకోవడంలో, ఇంజనీరింగ్ విద్యలో గణిత శాస్త్ర పరిజ్ఞానం ఎంతో అవసరమని తెలిపారు. వై.ఎన్.రెడ్డి మాట్లాడుతూ వివిధ రంగాలలో మాత్రికల ప్రాముఖ్యతను తెలియజేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, గ్రాఫ్ థియరీలో దీని ఉపయోగాలను వివారించారు.ఫినిట్ డిఫరెన్స్ మెథడ్ థామస్ అల్గోరిథం ఉపయోగించిన తీరును ఈసందర్భంగా ప్రస్తావించారు.ఆనంతరం ప్రొఫెసర్ కె సత్యనారాయణ మాట్లాడారు. శ్రీనివాస రామానుజన్ యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర , రచనలు, పెల్స్ ఈక్వేషన్ , ప్రాచీన గణితానికి దాని ఔచిత్యం గొప్పదని గురించి తెలిపారు. ఈసందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ , తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్థిక సహకారం అందించినందుకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ సురేష్ దేవనపల్లి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త జి తిరుపతి, అసోసియేట్ డీన్స్ డాక్టర్ పావని, డాక్టర్ చంద్రశేఖర్, శ్రీ మహేష్, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు సునీల్ కుమార్, డాక్టర్ కుమార్ రాగుల, బాలరాజు, సత్తన్న, సాయన్న, ప్రకాష్ అతిథి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.