యాదగిరిగుట్ట మండలం వంగపల్లి శుక్రవారం, స్వామి వివేకానంద ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ విద్యా ప్రముఖత, క్లినికల్ ట్రయల్స్, డేటా మేనేజ్‌మెంట్, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అనే అంశాలపైన క్లిన్ఆక్సి ప్రవేట్ లిమిటెడ్ సంస్థ అధ్వర్యంలో జాతీయ సదస్సు, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లిన్ఆక్సీ సీఈఓ సతీష్ వేమవరపు, ప్రతినిధులు డాక్టర్ కె రమాకాంత్, రవితేజ శిక్షణ తరగతులు నిర్వహించారు. కళాశాల చైర్మన్ అనిత, సెక్రటరీ వెంకట్ రెడ్డి, డైరెక్టర్ ఉదయకుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కే హేమమాలిని మాట్లాడుతూ.. ఈ శిక్షణ తరగతులు విద్యార్థులకు క్లినికల్ రీసెర్చ్, ఫార్మకోవిజిలెన్స్, రేగులటరీ అఫైర్స్, ఫార్మా ఇండస్ట్రీ ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగ పడుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డా మత్స్యగిరి, ఏఓ వేణుగోపాల్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.