నవతెలంగాణ – రెంజల్
రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ నివారణ లో భాగంగా వైద్య సిబ్బందిచే అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు డాక్టర్ వినయ్ కుమార్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు వైద్య సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దోమతెరలు వాడాలని, పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవాలని ఈ ర్యాలీలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సహస్థ పీర్దోష్, మలేరియా నోడల్ అధికారి కరిపే రవీందర్, ఆరోగ్య సూపర్వైజర్ మాలంబి, ఆరోగ్య విస్తీర్ణ అధికారి శ్రావణ్ కుమార్, ఫార్మసిస్ట్ రామచందర్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.