బిఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ ..

Inauguration of National Flag at BRS office..నవతెలంగాణ – కంఠేశ్వర్ 
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ను బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ నుడా ఛైర్మన్ ప్రభాకర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.