విద్యార్థులకు నేషనల్ హైవే వారి నగదు పురస్కారం

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్

పెద్దకొడప్ గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం2022 /23లో10వ తరగతి ఫలితాల్లో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలకు చెందిన శివప్రసాద్ 9.5,చందన9.2ఫలితాలు సాధించగా విద్యార్థులకు నేషనల్ హైవే వారు నగదు పురస్కారంతోపాటు ప్రశంసా పత్రంతో సత్కరించారు.సోమవారం రోజున మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ మండలంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైవే పరిధిలో ఉన్న హైస్కూల్లోని సుమారు 54 మంది విద్యార్థినీ విద్యార్థులకు హైవే అధికారులు సన్మానించారు.ఈ సందర్భంగా పెద్దకొడప్ గల్ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఎంపిక కావడంతో వారికి నగదు పురస్కారం అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నేషనల్ హైవే వారు ఈ నగదు బహుమతి పురస్కారం అందజేయడం చాలా సంతోషకరంగా ఉందని ఇలాంటి ప్రోత్సాహాల వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అధిక మార్కులు సాధించాలనే పట్టుదల ఉంటుందని ప్రస్తుతం చదువుతున్న పదో తరగతి విద్యార్థులు కూడా ఈ పురస్కారానికి ఎంపిక అయ్యేవిధంగా కష్టపడి చదివి పాఠశాలకు వారి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఈ పురస్కారం అందుకుంటున్న అందుకు చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం చంద్రకాంత్,కిషన్,శశికాంత్,రాకేష్,ఫయాజ్,రాజేందర్, ఉపాధ్యాయులు,విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.