జాతీయ న్యాయ సేవల దినోత్సవం..

-కొఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఉచిత న్యాయ సలహా కేంద్రం ప్రారంభం..

-మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి లీగల్ సర్వీసెస్ అధ్యక్షురాలు ఎస్ ప్రేమావతి
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని అందుబాటులో న్యాయసేవలు, న్యాయపరమైన అవగాహన కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ వారు గురువారం కోఠి లోని తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయం ఆవరణ లో ఉచిత న్యాయ సలహా, సహాయ కేంద్రం ఏర్పాటు చేసారు హైదరాబాద్ మెట్రోపాలిటన్  సెషన్స్ జడ్జి, లీగల్  సర్వీసెస్ అధ్యక్షురాలు ఎస్. ప్రేమావతి  ప్రారంభోత్సవం చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఉచిత న్యాయ సలహా,  సహాయ  కేంద్రం లో సేవలు అందించటానికి సంస్థ యొక్క పానెల్ అడ్వకేట్, పారా లీగల్  వాలంటీర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. విశ్వవిద్యాలయం  లో చదివే విద్యార్థినులు  ఈ సేవలను ఉపయోగించుకొని   న్యాయపరమైన సమస్యలను  చట్టాలకు లోబడి తగిన  పరిష్కార మార్గాలను  ఎంచుకోవచ్చునని చెప్పారు.వ్రాతపూర్వక ఫిర్యాదులను లీగల్ సర్వీసెస్  సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ కి అందచేయవచ్చునని తెలిపారు. విద్యార్థినులు చక్కగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి తమ కాళ్ళ మీద తాము నిలబడి విశ్వవిద్యాలయానికి ఎంతో పేరు తేవాలని కోరారు. సంస్థ ప్యానెల్ అడ్వొకేట్ రామసుభద్ర, పారాలీగల్ వాలంటీర్లు మజీదుద్దిన్,మహమ్మద్  రజాక్, లను  పరిచయం చేసారు. ఇంచార్జి వైస్ ఛాన్సలర్  విజ్జులత  మాట్లాడుతూ.. విద్యార్థినిల కు ఉపయోగకరమైన  కేంద్రాన్ని తమ ఆవరణలో ప్రారభించినందుకు లీగల్ సర్వీసెస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.  విద్యార్థినులు సేవలు వినియోగించుకొని చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో విశ్వవిద్యాలయ  స్పెషల్ ఆఫీసర్ సరస్వతమ్మ, సుల్తాన్ బజార్ ఇన్ స్పెక్టర్ కె ముత్తు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ అడ్వొకేట్ అనంత రఘు, సంస్థ కోఆర్డినేటర్ అబ్దుల్ వాసి , కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బి శైలజ, జే పీ వి లక్ష్మి, డాక్టర్ జ్యోతి, పి అర్ ఓడాక్టర్ కృష్ణాజి రావు, విశ్వవిద్యాలయ సిబ్బంది, విద్యార్థినులు  పాల్గొన్నారు.