కలమడుగు వాసుకి జాతీయ స్థాయి అవార్డు

National level award for Kalamadugu residentనవతెలంగాణ – జన్నారం
మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన  బొంతల మధుకర్, మొక్కజోన్న లో డ్రోన్లను ఉపయోగించి కలుపు మందుల పిచికారి పైన చేస్తున్న పరిశోధన ప్రతిభ ను గుర్తించి ఢీల్లీలోని ఇండియన్ సోసైటి ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టేక్నాలజీ రీసర్చ్ ఆధ్వర్యంలో కరెంట్ ఇన్నోవేషన్ అండ్ టేక్నలాజికల్ అడ్వాన్స్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్స్ విభాగంలో  జాతీయ స్థాయి ఉత్తమ అవార్డును అందుకున్నారు.వ్యవసాయ కుటుంబంలో పుట్టి డిగ్రీని పోలాస వ్యవసాయ కళాశాలలో ,పిజిని విశ్వా భారతీ – శాంతినికేతన్ వేస్ట్ బెంగాల్ లో పూర్తి చేసి ప్రస్తుతం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం లో పీ హెచ్ డి చేస్తున్నాడు.ఈ అవార్డు అందుకోవడం పట్ల ఆయనను గ్రామప్రజలు,తదితరులు అభినందించారు.