నవతెలంగాణ-రామగిరి : సింగరేణి సంస్థ ఆర్జి-3 ఏపీఏ పరిధి అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ (ఏఎల్పి)కి 2023-2024 సంవత్సరానికి గాను బెస్ట్ టెక్నాలజీ మైన్ ఇన్ అండర్ గ్రౌండ్ కోల్ జాతీయస్థాయి అవార్డు దక్కింది. ఏపీఏ జిఎం కె వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ అఫీనరు కె నాగేశ్వర రావు, అడిషనల్ మేనేజర్ శ్రీకాంత్ డీవ్ అండర్ గ్రౌండ్ కోల్ మైనింగ్ లో సమర్థత, భద్రతను పెంచటం, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కూలింగ్, ట్యుబ్ బండిల్ గ్యాన్ మానిటరింగ్ సిస్టమ్ లతో కూడిన ఏఎల్పి కేన్ స్టడీ సమర్పించారు. దాని ఆధారంగా బెస్ట్ టెక్నాలజీ మైన్ ఇన్ అండర్ గ్రౌండ్ కోల్ 2023-2024 కేటగిరీలో భాగంగా (ఐకాన్- ఎస్ఎస్ఎంటి) 2024 అధ్వర్యంలో భువనేశ్వర్ లో జరిగిన నదస్సులో ఏఎల్పి గనికి అవార్డు దక్కగా గని మేనేజర్ ములుకుంట్ల తిరుపతి అవార్డును అందుకున్నారు.