– ఘనంగా వర్క్‌షాపు ప్రారంభం
హైదరాబాద్: స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు (శనివారం వరకు) నిర్వహించబోయే ఈ వర్క్ షాప్‌కు కళాశాల లైబ్రేరియన్ ఎం మాధవి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వివిధ అంశాలపై ఈ మూడు రోజులపాటు నిపుణులతో ప్రజెంటేషన్లు ఉంటాయని చెప్పారు. శనివారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి, వక్తగా ప్రొఫెసర్ ఎస్ సుదర్శన్ రావు (పూర్వ విభాగాధిపతి లైబ్రరీ మరియు సమాచార విభాగము ఉస్మానియా యూనివర్సిటీ) హాజరయ్యారు. కళాశాల డీన్ ప్రొఫెసర్ ఏ వినరు బాబు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యప్రసాద్ లంక గారు, డాక్టర్ కనకదుర్గ (డైరెక్టర్ అకాడమిక్స్ అండ్ ఆడిట్) గారు, డాక్టర్ వి అనురాధ (డైరెక్టర్ స్టూడెంట్స్ సపోర్ట్ సిస్టం), శ్రీ ఏ రమేష్ గారు (అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్) మరియు లైబ్రరీ కమిటీ సభ్యులు హాజరయ్యారు. కళాశాల డీన్ ప్రొఫెసర్ ఏ వినరు బాబు గారు మాట్లాడుతూ లైబ్రరీలు జ్ఞాన సమపార్జనకు ఎంతో ఆవశ్యకమని చెప్పారు. గ్రంథాల యోధ్యమం సమాజ అభివృద్ధికి ఎంతో దోహద పడిందని గుర్తుచేశారు. నేడు పుస్తకాలు చదివే అలవాటు దాదాపుగా తగ్గిపోయిందని వాపోయారు. సెల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం వలన పుస్తకాలు చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మధ్యాహ్న భోజనానంతరం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు రెండవ సెషన్ జరిగింది. ఈ సెషన్‌లో ముఖ్య వక్తగా డాక్టర్ అక్తర్ పర్వేజ్ (లైబ్రేరియన్, మను యూనివర్సిటీ హైదరాబాద్) హాజరయ్యారు. ఈ వర్క్ షాప్ నకు నగరంలోని వివిధ కళాశాలల నుండి లైబ్రరీ స్టాప్ మరియు ఇతర అధ్యాపకులు చురుగ్గా పాల్గొన్నారు.