భువనగిరి మండలంలోని బొల్లెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జాతీయ నూలిపురుగుల దినోత్సవం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇమ్యూనైజాషన్ వైద్యాధికారి డా.రామకృష్ణ హాజరై మాట్లాడుతూ ఫిబ్రవరి 10వ తేదీన బొల్లెపల్లి లోపనిచేస్తున్న ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది అందరూ పాల్గొని జాతీయ నులిపురుగుల నిర్మూలన మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతారని తెలిపారు. నులి పురుగుల నిర్మూలనకై ప్రతి ఒక్కరు పిల్లవాడు ఈ మాత్రలు మింగాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యధికారి డాక్టర్ యామిని శృతి మాట్లాడుతూ అంగన్వాడీ ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ సెంటర్లో, మండల ప్రజాపరిషత్ జిల్లా పరిషత్ ఆశ్రమ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
ఈనెల 10 ఫిబ్రవరి 2025, ఫిబ్రవరి 15 ఫిబ్రవరి 2025 న మాప్ అప్ రౌండ్ మ్రింగని పిల్ల కోసం నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 10 ఫిబ్రవరి 2025 న ప్రారంభ కార్యక్రమం నకు జిల్లాస్థాయిలో, డివిజన్ స్థాయిలో, మండలస్థాయిలో , గ్రామస్థాయిలో) , సంబంధిత శాఖ అధికారులను హాజరయ్యేలా చూడాలని,
1 నుండి 2 సంవత్సరముల పిల్లలకు సగం మాత్ర,చెంచలో పొడిచేసి నీళ్లలో కలిపి అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ టీచర్ త్రాగించాలని,
2 నుండి 3 సంవత్సరముల పిల్లలకు పూర్తి మాత్ర చెంచలో పొడిచేసి నీళ్లలో కలిపి అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ టీచర్ త్రాగించవలెననీ కోరారు.
3 నుండి 19 సంవత్సరముల పిల్లలకు మాత్ర నమిలి చప్పరించిన తరువాత నీరు త్రాగవచ్చు అన్నారు. ఏ ఈ ఎఫ్ ఐ – మాత్ర మింగిన తర్వాత ఏ రకమైన దుష్పరిమాణాలు వచ్చినచో వెంటనే సంబంధిత ఆరోగ్య సిబ్బందికి , వైద్యాధికారికి తెలియజేసి 108 /ఆర్.బి.ఎస్.కె , ఎం.హెచ్.టి వాహనం ద్వారా దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తామన్నారు. ఆల్బెండజోల్ మాత్ర ఆహారము తీసుకున్న తరువాతనే ఇవ్వాలని సూచించారు. ఖాళీ కడుపుతో ఉన్నవారికి ఇవ్వకూడదనీ, పాఠశాలలు, కాలేజీలలో పిల్లలకు సంబంధిత ఉపాధ్యాయని ,ఉపాధ్యాయులు మాత్రలు మింగించవలెననీ, అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అంగన్వాడి టీచర్ మాత్రలు మింగించవలెననీ కోరారు.