16న నేషనల్‌ లోక్‌ అదాలత్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నేషనల్‌ లోక్‌ అదాలత్‌ను ఈ నెల 16న నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్య కార్యదర్శి ఎస్‌.గోవర్థన్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లోక్‌ అదాలత్‌ రాష్ట్ర హైకోర్టు నుంచి తాలుకా స్థాయి వరకు అన్ని స్థాయిల్లో ఉంటుందని చెప్పారు.