కాంగ్రెస్‌ ప్రచారంలో కనిపించని జాతీయ రాజకీయాలు

– సొంత చరిష్మా మీదనే ప్రచారం
– కాంగ్రెస్‌ మేనిఫెస్టో లేదు
– వివరిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం
నవతెలంగాణ-శంషాబాద్‌
ఏ పార్టీకైనా జాతీయ, ప్రాంతీయ లక్ష్యా లు ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో ఉండే సమ స్యలు అవసరాలు ప్రతిబించే విధంగా ప్రతి పార్టీ మేనిఫెస్టో తయారు చేసుకుంటుంది. జాతీయస్థాయి ఎన్నికలకు అనుగుణమైన కార్యాచరణ అనేది ఉంటుం ది. దేశంలో, రాష్ట్రంలో రెండు రకాల మేనిఫెస్టోలు ఉం టాయి. ఈ అంశాలను ప్రజల్లోకి వివిధ రూపాల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీలపై ఉంటుంది. ప్రస్తుతం దేశంలో పార్ల మెంట్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు ర్యాలీలు, బహి రంగ సభలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొదటి నుంచి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టింది. జై శ్రీరామ్‌ నినాదం, పాకిస్తాన్‌, చైనా, కా శ్మీర్‌ అంశాలు మతపరమైన అంశాలను ప్రచార అస్త్రాలు గా వేసుకున్నాయి. మోడీ మొఖం చూసి ఓటేయాలని ఆ పార్టీ నాయకులు గట్టిగా ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్‌ పార్టీలో కానరాని జాతీయ రాజకీయాలు
శంషాబాద్‌ మండలంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యం లో రెండు చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో దేశ రాజకీయాల ప్రస్తావన మచ్చుకైన కానరావడం లేదు. స్వాతంత్య్రాన్ని సా ధించి అనంతరం అధికారంలోకి వ చ్చిన కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావన లేదు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రస్థానం ఊసే లేదు. ఆయన రెండోసారి చేప ట్టిన భారత్‌ న్యాయ యాత్ర గురించి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరిం చింది లేదు. జాతీయ ఎన్నికల శంఖా రావం తుక్కుగూడలో ప్రారంభిం చారు. ఈ సభలో భారత్‌ న్యాయ యాత్రతో పాటు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వస్తే దేశవ్యాప్తంగా ఐదు గ్యారంటీలు అమలు చేస్తామన్న మేనిఫెస్టో ప్రస్తా వన లేనేలేదు. దీంతో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వస్తే ఏం పని చేస్తుందన్న విషయం ప్రజలకు ఎందుకు వివరించడం లేదన్నవి ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నది. దేశంలో చెలరేగుతున్న హింస, కాంగ్రెస్‌ నినాదం అ యిన అహింస గురించి ప్రస్తావన అసలే స్థానిక నేతలకు దేశ రాజకీయాలతో సంబంధం లేదన్నట్లుగా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సభలు జరుగుతున్నాయి. మోడీ నినాదం బీజేపీ ఎత్తుకుంటే.. కాంగ్రెస్‌ రాహుల్‌ నినాదం ప్రజ ల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల ప్రచా రంలో కేంద్ర బిందువుగా కాంగ్రెస్‌ అభ్యర్థిని చూపి ఓట్లు అడగడం జరుగుతు న్నది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన అంశాలు మరుగున పడిపోతు న్నాయి. అతిమంగా కాంగ్రెస్‌కి నష్టం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ దేశంలో అధికారంలోకి వస్తే చేపట్ట బోయే అభివృద్ధి గురించి ప్రచారం జరగకపోవడం విస్మ యానికి గురి చేస్తున్నది. జాతీయ రాజకీయ అంశాల ప్రతిపాదికన ప్రచారం ప్రజలకు అవగాహన కల్పించా ల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకులపైనే ఉంది.