మిక్స్‌డ్‌ రిలేలో జాతీయ రికార్డు

మిక్స్‌డ్‌ రిలేలో జాతీయ రికార్డు– ఆసియా రిలే చాంపియన్‌షిప్స్‌
న్యూఢిల్లీ : భారత అథ్లెట్లు జాతీయ రికార్డు నెలకొల్పారు. ఆసియా రిలే చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన మన స్ప్రింటర్లు నేషనల్‌ రికార్డును మెరుగుపర్చారు. 4 (400) రిలే మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో మహ్మద్‌ అజ్మల్‌, జ్యోతిక, జాకబ్‌, సుభా వెంకటేశ్‌లు 3.14.12 సెకండ్లలోనే రేసును ముగించారు. గత జాతీయ రికార్డు కంటే 0.22 సెకండ్ల వేగంగా పరుగు పూర్తి చేశారు. ఈ విభాగంలో శ్రీలంక, వియత్నాం అథ్లెట్లు సిల్వర్‌, కాంస్య పతకాలు సాధించారు.