
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని దోస్పల్లి జీపీ గ్రామములో గత వారం రోజులుగా వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ గ్రామీణ ఆభివృద్ది విద్యనబ్యసిస్తున్న విద్యార్థులు గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న ఆభివృద్ది పనులను క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజలతో మాట్లాడి అడిగి తెలుసు కున్నారు . ఈ సంధర్భంగా స్థానిక సర్పంచ్ సునితా పటేల్, జీపీ కార్యదర్శి జాదవ్ మనోహర్ తో కలిసి గ్రామములో తిరిగి ప్రజల జీవన విదానం , ఆర్థిక స్థితి గతులు, దైనందిక జీవితం, ఆరోగ్యం, విద్య, తో పాటు గ్రామపంచాయతి, పాఠశాల, అంగన్ వాడి కేంద్రం, ఆశా కార్యకర్తల సేవలు, చౌకధర దుకాణం, స్వయహయక సంఘాల పనితీరు, వ్వవసాయం, ఉపాదీ వాటిని పరీశీలించారు. కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్, బీహర్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఏడు గురు విద్యార్థులు హైద్రాబాద్ లోని జాతీయ గ్రామీణ ఆభివృద్ది సంస్థ లో పీజీ మరియు డిప్లమా వుద్యార్థులు ఉన్నారని జీపీ కార్యదర్శి తెలిపారు. గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు.