ఎస్ఆర్ డీజీ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం

నవతెలంగాణ – కంటేశ్వర్
నగరంలోని  గంగాస్థాన్ లో గల ఎస్ ఆర్ డి జి పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా 4 వ తరగతి నుండి 9 వ తరగతి విద్యార్థులు వివిధ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శనకు విచ్చేసిన ఎస్ ఆర్ పాఠశాలల చైర్మన్ వరదారెడ్డి , డైరెక్టర్ సంతోష్ రెడ్డి , జోనల్ ఇంఛార్జి ప్రణీత్ కుమార్ , ప్రిన్సిపల్ సరళ  ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థుల నైపుణ్యాన్ని, సృజనాత్మకను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల లోని సైన్స్ ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది.