– పాల్గోన్న ఎం.పి రామ సహాయం,ఎమ్మెల్యే జారే…
నవతెలంగాణ – అశ్వారావుపేట
హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవాన్ని గురువారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో స్పోర్ట్స్ అధారిటీ ఆద్వర్యంలో ఈ సంస్థ జిల్లా అధికారి పరంధామయ్య రెడ్డి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. అశ్వారావుపేట – జంగారెడ్డిగూడెంలో నీటిపారుదల శాఖ డివిజనల్ కార్యాలయం ప్రాంగణంలోని ఖాలీ ప్రదేశంలో రూ.2 కోట్ల 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియం కు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురామ రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో పీఆర్ డీఈ శ్రీధర్, ఐటీడీఏ డీఈ రామిరెడ్డి, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు కే.ప్రదీప్ కుమార్, ఎంఈవో కే.లక్ష్మి, సీఐ కరుణాకర్, నాయకులు జూపల్లి రమేష్, తుమ్మ రాంబాబు, జూపల్లి ప్రమోద్, నండ్రు రమేష్, మిండ హారిబాబులు పాల్గొన్నారు.