– ఐఓఏ కార్యదర్శిని కోరిన జగన్
హైదరాబాద్ : జాతీయ క్రీడల ఆతిథ్య హక్కులను తెలంగాణకు ఇవ్వాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రధాన కార్యదర్శి, తాత్కాలిక సీఈవో కళ్యాణ్ చౌబేను భారత హ్యాండ్‌బాల్ సంఘం (హెచ్‌ఏఐ) జాతీయ కార్యదర్శి అర్శినపల్లి జగన్‌మోహన్ రావు కోరారు. ఐ-లీగ్ (ఫుట్‌బాల్)లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ, నెరోకా ఎఫ్‌సీతో మ్యాచ్‌ను చూసేందుకు ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడిగా హైదరాబాద్‌కు వచ్చిన కళ్యాణ్ చౌబేతో కలిసి జగన్‌మోహన్ రావు నగర శివార్లలోని డెక్కన్ ఎరీనాకు వచ్చారు. రానున్న నాలుగేండ్లలో ఓసారి జాతీయ క్రీడల ఆతిథ్య హక్కులను తెలంగాణకు ఇవ్వాలని జగన్ కోరగా.. కళ్యాణ్ చౌబే సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌మోహన్‌రావును కళ్యాణ్ చౌబే అభినందించారు.