జాతీయ ఓటుహక్కు దినోత్సవం..

National Voting Dayనవతెలంగాణ – సారంగాపూర్
మండల కేంద్రంలోని వినేకనంద ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో జాతీయ ఓటుహక్కు దినోత్సవం నిర్వహించారు ఈ సందర్బంగా విద్యార్థులు ప్రధాన విధులగుండా ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఓటుహక్కుపై అవగాహన  కల్పించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు విలువ గురించి తెలుసుకొని ఎన్నికలలో ఓటును సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి,యువకులు ఓటురుగా నమోదుచేసుకుకొని గుర్తింపు కార్డు పొందాలని అన్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు ఓటు హక్కు దాని ప్రాధాన్యత పై క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ లిఖిత,ప్రధానోపాధ్యాయులు విమల,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.