నవతెలంగాణ -హైదరాబాద్: 7 బ్లాక్ కో-కో హైదరాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్ కబడ్డీ ప్లేయర్స్ కి ఎంపిక ప్రక్రియ 14-04-2024 ఆదివారం రోజున జరుగుతున్నాయి. మే 4,5,6 తేదీలలో గోవాలో నేషనల్ కబడ్డీ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. అండర్ – 17ఏళ్ల లోపు విద్యార్థులకు ST.PIUS X HIGH SCHOOL , రాంనగర్ వేదికగా సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కబడ్డీ పోటీలలో పాల్గొనేవారు ఆధార్ కార్డు, 3 పాస్ ఫోటోలు తీసుకురావాలని అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ , సెక్రటరీ రామస్వామి కోరారు. ఇతర వివరాలకు 9700454663, 9618363947 నెంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.