– డిప్యూటీ తాసిల్దార్ సురేష్ బాబు, ఎంఈఓ రేగ కేశవరావు
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగులు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తాడ్వాయి గ్రామపంచాయతీ కార్యాలయం నుండి మేడారం ఆర్చ్ గేట్ వరకు విద్యార్థు లు, అధ్యాపకులు, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, బి ఎల్ వో లు కాంగ్రెస్ పార్టీ నాయకులతో నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్కు ఎదురుగా మేడారం హార్ట్ గేట్ వద్ద మానవహారంగా నిల్చోని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కోటే రేవతి అధ్యక్షతన విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సిటిజన్ అయిన ఓటర్లు కందికొండ సారమ్మ, మాలోతు మంగమ్మ లను, బెస్ట్ బిఎల్ఓ రంగాపూర్ సీతారత్నం ను, వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను మోమెంటు ఇచ్చి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్ జె సురేష్ బాబు, ఎంఈఓ రేగ కేశవరావు, ఎంపీ ఓ జాల శ్రీధర్ రావు, పీజీహెచ్ఎం రేవతిలు మాట్లాడుతూ .. ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటామని అన్నారు. 1950లో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్థాపించిన రోజు నుండి గుర్తు చేసుకుంటూ కేంద్రం ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తుందని అన్నారు. ఎన్నికల్లో ఓటర్లను భాగస్వామ్యం చేసేందుకు, ఓటింగు ప్రాముఖ్యత తెలియజేసేందుకు 2011 నుంచి ఈ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ భవిష్యత్తు యువత పై ఆధారపడి ఉన్న నేపథ్యంలో వారిని ఓటింగ్ వైపు ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఏడాది నైథింగ్ లైక్ ఓట్.. ఐ ఓట్ ఫర్ ష్యూర్ ” థీమ్ తో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 18 సంవత్సరాలు దాటి న యువతి యువకులు కచ్చితంగా ఓటు హక్కు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సురేష్ బాబు, ఎంపీ ఓ శ్రీధర్ రావు, మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు, ఆర్ఐ లు సాంబయ్య, రాజు, పీజీహెచ్ఎం రేవతి,సీనియర్ అసిస్టెంట్ నాగన్న, కార్యదర్శులు రాజశేఖర్, రుక్మిణి జమున తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, ముజాఫర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.