
ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుమలగిరి మండల కేంద్రంలోని అనంతారం మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల వ్యాప్తంగా విద్యాసంస్థలలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని మహిళా ఉపాధ్యాయులను గౌరవించి వారిని ఘనంగా సన్మానించారు. తిరుమలగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఆదర్శ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈఓ శాంతయ్య,ప్రధానోపాధ్యాయులు దామెర శ్రీనివాస్, సంజీవ్ కుమార్ లు మాట్లాడుతూ కుల మత చట్టాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి సావిత్రిబాయి పూలే అన్నారు.బడుగు బలహీన వర్గాలఅభ్యున్నతిమహిళల విద్యాభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే విశేష కృషి చేశారన్నారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి అందుకోసం పాటుపడ్డారన్నారు. కుల వ్యవస్థ, పితృ స్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా శూద్రులు, అస్పృశ్యులు మహిళల హక్కుల కోసం పోరాటం చేశారన్నారు.నూతన వ్యవస్థ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి సమిష్టిగా పోరాడారన్నారు. ముఖ్యంగా స్త్రీల విద్య అభివృద్ధి కోసం కృషి చేసిన తొలి తరంమహిళా ఉద్యమకారిణిగా పేరుపొందారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.