జాతీయ మహిళల ఖో ఖో జట్టు కోచ్ నరేష్ నాయక్ కు ఘనసన్మానం 

నవతెలంగాణ – ధర్మారం   
మండలంలోని బంజేరుపల్లి లంబాడి తండా బి గ్రామానికి చెందిన ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన జాతీయ మహిళల ఖోఖో జట్టు కోచ్ ఇస్లావత్ నరేష్ నాయక్, స్వగ్రామం బంజేరుపల్లి లంబాడి తండా(B) బంజార ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ కప్పు గెలిచి స్వగ్రామానికి ఆదివారం రోజు వస్తున్న సందర్భంగా మండలంలోని పత్తిపాక X రోడ్ నుండి లంబాడి తండా వరకు డప్పు వాయిద్యాలతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. స్వగ్రామంలో స్వాగతం పలుకుతూ తండా వాసులంతా కలిసి తండా లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఘనంగా సభ ఏర్పాటు చేసి బంజార ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు నున్సావత్ మోతిలాల్ నాయక్ ప్రధాన కార్యదర్శి బధావత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో జాతీయ మహిళల ఖో ఖో కోచ్ ఇస్లావత్ నరేష్ నాయక్ ను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు శంకర్ నాయక్, బానోత్ రాము నాయక్ కోశాధికారి ఇస్లావత్ శ్రీనివాస్ నాయక్, ప్రకాష్ నాయక్, ప్రవీణ్, రవి నాయక్ ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్లా నాయక్ గ్రామ పెద్దలు శంకర్ నాయక్, రాజు నాయక్, ఇస్లావత్  రాజునాయక్, నరహరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.