
జాతీయ యువజన కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో పట్టణం లో అంబేద్కర్ చౌరస్తా లో యువజన కాంగ్రెస్ జెండా శుక్రవారం ఆవిష్కరణ చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యఅతిధిగా విచ్చేసిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, మున్సిపాల్ ఛైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరించా. ఈ సందర్భంగా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్ వల్ల ఒక సామాన్య కార్యకర్త కూడా ఎన్నికల ద్వారా జాతీయ స్థాయి లో గుర్తింపు పొందే అవకాశం కేవలం యువజన కాంగ్రెస్ మాత్రమే కల్పిస్తుంది అని, ప్రభుత్వ ఏర్పాటు లో యువజన కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషించిదని. కార్యకర్తల కష్టం చాలా ఉంది అని రానున్న రోజుల్లో అందరికి సమూచిత న్యాయం జరిగేలా పార్టీ నిర్ణయాలు ఉంటాయని అయన అన్నారు. రేపటి నుండి యువజన కాంగ్రెస్ ఎన్నికలు మొదలు కావున రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వాలు మన నియోజకవర్గంలో నమోదు కావాలని అయన అన్నారు ..ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్, పట్టణ ఓబీసీ సెల్ దొండి రమణ, ఆకుల రాము, యువజన కాంగ్రెస్ నాయకులు ఇర్ఫాన్,అల్జపూర్ సాయికిరణ్, కండె కిరణ్, శ్రీనివాస్ అగర్వాల్, దేవేందర్ రెడ్డి, టైగర్ శ్రీనివాస్ గౌడ్,నరేష్,శ్రీకాంత్, శుశాంత్, మోసిన్, వినోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపెందర్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.