నవతెలంగాణ – భువనగిరి: గ్రామీణ తపాలా ఉద్యోగులు వారి నాణ్యమైన డిమాండ్ల కొరకు దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బిపిఎం జిల్లా అధ్యక్షులు సత్తయ్య మాట్లాడుతూ రెండవ రోజు సమ్మెలో జిడిఎస్ ఉద్యోగులకు దేశవ్యాప్తంగా 2 లక్షల మంది నేడు సమ్మె బాటలో ఉన్నారని తెలిపారు. న్యాయమైన కోరికలను నెరవేర్చలన్నారు. కమలేష్ చంద్ర కమిటీ సానుకూల సిఫారసును అమలు చేయమని భువనగిరి హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టామని తెలిపారు. భువనగిరి సబ్ డివిజన్ కిద్దన ఉన్న అన్ని పోస్ట్ ఆఫీస్ లు ఈ ధర్నాలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బిపిఎం లక్ష్మీ నరసయ్య ,వెంకటయ్య ,మారయ్య, అంజయ్య మురళి, భాస్కర్, సత్తిరెడ్డి, వినయ్, సుకన్య, ఉమారాణి, సునీత, సహారా లతీఫ్ నరసయ్య పాల్గొన్నారు