కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్త ఆందోళనలు జయప్రదం చేయండి

– సిఐటియు రాష్ర్ట ఉపాధ్యక్షులు భూపాల్.
సిఐటియు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – భువనగిరి
కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక, మతోన్మాద విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వవర్యంలో ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త ఆందోళనలు జయప్రదం చేయాలని సిఐటియు రాష్ర్ట ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపునిచ్చారు.  శుక్రవారం స్థానిక సిఐటియూ జిల్లా కార్యాలయంలో దాసరి పాండు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశం, క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిదిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ ప్రభుత్వం దేశంలో కార్మికుల జీవితాలతో ఆటలాడుతుందన్నారు. రోజుకో చట్టం, పూటకో నిబంధనలతో శ్రమ దోపిడీ చేస్తుందన్నారు. నాలుగు లేబర్ కోడ్ లు అమలు చేస్తూ కార్మికుల సంఘటిత శక్తిని విచ్చిన్నం చేస్తూ, కార్మిక పోరాటాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. మతం పేరుతో కార్మిక వర్గంలో సైతం విభజన తెస్తూ, రాజ్యాంగ విలువల్ని కాలరాస్తుందన్నారు. నూతన మోటార్ వెహికిల్ చట్టం ద్వారా ట్రాన్స్ పోర్ట్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అయోధ్య పేరుతో మత రాజకీయాలు చేస్తూ , దేశ ప్రజల దృష్టిని మళ్ళించే కుట్ర చేస్తుందన్నారు. బీజేపి ప్రభుత్వం అవలంబించే అప్రజాస్వామిక కార్మిక,మతోన్మాద నియంతృత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరిగే నిరసనల్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం,జిల్లా ఉపాధ్యక్షులు యండి పాష,గొరిగె సోములు,సహాయ కార్యదర్శులు  బోడ భాగ్య, మాయ కృష్ణ, జిల్లా నాయకులు ఆదిమూలం నందిశ్వర్, బొడ్డుపల్లి వెంకటేశం, పోతరాజు జహంగీర్, బత్తుల దాసు, గడ్డం వెంకటేశం  పాల్గొన్నారు.