నవతెలంగాణ – భువనగిరి
మోడీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా నవంబర్ 26 న జరిగే దేశవ్యాపిత నిరసనలు జయప్రదం చేయాలని జాయింట్ ప్లాట్ ఫారమ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ మరియు సంయుక్త కిషన్ మోర్చా జిల్లా నాయకత్వం పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయం భువనగిరి లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఐయన్ టియుసి , ఏఐటీయూసీ, సిఐటియు ,రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు నష్టం చేసే చట్టాలను తీసుకువచ్చిన మోడీ ప్రభుత్వం విధానాలపై పోరాడి మోడీ మొడలు వంచిన చరిత్ర పోరాటానికి ఉన్నదని తెలిపారు. కార్మిక చట్టాలను రద్దు చేసి నూతన లేబర్ కోడ్ లను తీసుకువచ్చిన మోడీ బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని విమర్శించారు.మోడీ విధానాలపై రైతుల చలో ఢిల్లీ పోరాటం నిర్వహించిన రోజు నవంబర్ 26 అని అందుకోసం నవంబర్ 26 న జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ నుండి ప్రిన్స్ చౌరస్తా వరకు జరిగే ర్యాలీ లో, సభలో ప్రజలు , కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ టీయూసి జిల్లా అధ్యక్షులు సుడుగు జీవన్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేష్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు కొల్లూరి రాజయ్య, మాటూరి బాల్ రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండమడుగు నరసింహ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దాసరి పండు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ, నాయకులు సామల శోభన్ బాబు, కోళ్ల కృష్ణ, బోడ భాగ్య పాల్గొన్నారు.