
– మాయ కృష్ణ, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి
నవతెలంగాణ – భువనగిరి
ఈనెల 16న దేశవ్యాప్త గ్రామీణ బందును జయప్రదం చేయాలని పట్టణంలో గ్యాస్ ఆఫీస్ వద్ద కార్మికులచే సంతకాలు చేయించారు. గ్యాస్ డెలివరీ కార్మికులకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేక గ్యాస్ తీసుకుపోయే సమయంలో గానీ ఆటో ప్రమాదాలను జరిగినప్పుడు కానీ కార్మికులు చాలా నష్టపోతున్నారని తెలిపారు. కుటుంబ సభ్యులతో సహా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సేఫ్టీలు ఇవ్వాలని అదేవిధంగా ఇటీవల కాలంలో కార్మికులపై నిత్యవసర వస్తువులపై అనేకపరమైన జీఎస్టీలు వేస్తూ ధరలు పైకి వెళుతున్నదన్నారు. పెట్రోల్, డీజిల్ క్రూడ్ ఆయిల్ కంటే పోల్చితే పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నవి ధరలు నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనదన్నారు. కార్మికుల హక్కులను 44 చట్టాలను నాలుగు కోడ్ లుగా విధించి కార్మికులకు నష్టం చేయడం జరుగుతుందన్నారు. ఇటీవల కాలంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఆదాని అంబానీలకు ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతూ కార్మికులకు జీతాలు పెంచకుండా ధరలకు అనుగుణంగా కనీసం వేతనము 26వేల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16న దేశవ్యాప్త గ్రామీణ బందును పాల్గొనాలని కార్మికులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, ఎల్లేష్, శంకర్ కార్మికులు పాల్గొన్నారు.