దేశవ్యాప్తంగా రవాణా బందుకు మద్దతు

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా కార్మిక రంగాలు డ్రైవర్లు చేపట్టిన దేశవ్యాప్త బందుకు మద్దతుగా పెద్ద కొడంగల్ మండల కేంద్రంలో లారీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ బంద్ పాటించారు. ఆటోలు లారీలు పూర్తిగా నిలిపివేసి ఈ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలిపారు. మరియు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బస్సులు ఫ్రీ చేయడం వల్ల మేము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు తమ నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు షేక్ రషీద్,అనీఫ్ ఖాన్,అమర్ సింగ్,మస్తాన్,అజీమ్,మహమ్మద్ ముజీబ్,రవి పాల్గొన్నారు.